అమెరికాలోని తన దౌత్య కార్యాలయ భవనాన్ని అమ్మేస్తున్న పాకిస్థాన్

  • వాషింగ్టన్ లో పాక్ కు మూడు చోట్ల ఆస్తులు
  • ఒక భవనం విక్రయానికి బిడ్లకు ఆహ్వానం
  • రూ.56 కోట్లు ఆఫర్ చేసిన యూదుల సంస్థ
  • రూ.41 కోట్లకు బిడ్ దాఖలు చేసిన భారత రియల్టర్
ఆసియా దేశం పాకిస్థాన్ ఆశ్చర్యకర నిర్ణయం తీసుకుంది. దేశంలో ఆర్థిక పరిస్థితి నానాటికీ క్షీణిస్తున్న నేపథ్యంలో, విదేశాల్లో ఉన్న ఆస్తుల అమ్మకంపై దృష్టి సారించింది. అమెరికా రాజధాని వాషింగ్టన్ లో ఉన్న తన దౌత్య కార్యాలయ భవనాన్ని అమ్మకానికి పెట్టింది. ఈ ఎంబసీ భవనంలో గతంలో పాకిస్థాన్ రక్షణ శాఖ విభాగం కార్యకలాపాలు కొనసాగించింది. 

కాగా, ఈ భవనం కోసం ఇప్పటిదాకా మూడు బిడ్లు దాఖలైనట్టు డాన్ దినపత్రిక వెల్లడించింది. అత్యధికంగా రూ.56 కోట్లకు యూదులకు చెందిన ఓ సంస్థ బిడ్ వేసింది. భారత్ కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రూ.41 కోట్లకు బిడ్ దాఖలు చేయగా, పాకిస్థానీ రియల్టర్ ఒకరు రూ.33 కోట్లకు బిడ్ వేశారు. 

వాషింగ్టన్ లోని మూడు చోట్ల పాకిస్థాన్ దౌత్య విభాగానికి ఆస్తులు ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని అమ్మకానికి పెడుతున్నట్టు పాక్ వర్గాలు ఈ నెల మొదటివారంలో మీడియాకు తెలిపాయి. ఈ విక్రయానికి పాకిస్థాన్ క్యాబినెట్ ఆమోదం ఉన్నట్టు తెలుస్తోంది.


More Telugu News