టీవీ షో చూసి... మాజీ భార్యకు హెచ్ఐవీ రక్తం ఎక్కించిన యువకుడు
- గుజరాత్ లోని సూరత్ లో ఘటన
- భర్త వేధింపులు తట్టుకోలేక విడిగా ఉంటున్న మహిళ
- ఇటీవల విడాకుల మంజూరు
- కలిసుందాం అంటూ మహిళను కోరిన వ్యక్తి
- నిరాకరించిన మహిళ
- ప్లాన్ ప్రకారం హెచ్ఐవీ సిరంజితో దాడి
గుజరాత్ లోని సూరత్ లో ఓ వ్యక్తి (35) మాజీ భార్య పట్ల దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఆమెకు ప్రాణాంతక హెచ్ఐవీ వైరస్ తో కూడిన రక్తాన్ని ఎక్కించాడు. తన నుంచి విడిపోయిందన్న కసితో అతడు ఈ దురాగతానికి పాల్పడ్డాడు.
వీరిద్దరికి 15 ఏళ్ల కిందట పెళ్లయింది. అయితే, గొడవల కారణంగా వారి కాపురం సజావుగా సాగలేదు. దాంతో కోర్టు ఇటీవలే విడాకులు మంజూరు చేసింది. అంతకుముందే ఆమె భర్త వేధింపులు తట్టుకోలేక అతడి నుంచి దూరంగా వెళ్లిపోయింది. ఆమెను మళ్లీ కాపురానికి తీసుకువచ్చేందుకు ఆ వ్యక్తి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
దాంతో ఆమెపై కక్షగట్టిన అతడు టీవీలో ఓ క్రైమ్ షో చూసి స్ఫూర్తిపొందాడు. ఓ హెచ్ఐవీ పాజిటివ్ రోగి నుంచి రక్తం సేకరించి ఓ సిరంజిలో నింపాడు. మాట్లాడుకుందాం అని ఆమెను పిలిచాడు. ఇద్దరూ కలిసి షాపింగ్ చేయడంతో పాటు, ఓ రెస్టారెంటులో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆమెతో మోరా భాగల్ ప్రాంతానికి వెళ్లాడు. కాపురానికి రావాలంటూ ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. కానీ అందుకు ఆమె అంగీకరించలేదు.
దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు, ప్లాన్ ప్రకారం తనతో పాటు తెచ్చుకున్న హెచ్ఐవీ రక్తంతో కూడిన సిరంజిని ఆమెకు గుచ్చాడు. ఈ హఠాత్ పరిణామంతో తీవ్ర భయాందోళనలకు గురైన ఆమె స్పృహతప్పి పడిపోయింది. కాసేపటి తర్వాత తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఓ టీవీ షోలో కుక్క రక్తాన్ని మరో వ్యక్తికి ఇంజెక్షన్ ద్వారా ఎక్కించడం చూసి అతడు ఈ పన్నాగానికి పాల్పడ్డాడని పోలీసులు వివరించారు. హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించినట్టు ఒప్పుకున్నాడని తెలిపారు.