ఏపీ సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్రస్థాయి భేటీ... వేతనాల పెంపునకు డిమాండ్లు

  • 14వ ఆర్థిక సంఘం నిధుల చెల్లింపునకు డిమాండ్
  • రూ.8,660 కోట్లను పంచాయతీలకు జమ చేయాలని స్పష్టీకరణ 
  • వాలంటీర్లకు, ఆయాల కంటే తక్కువ వేతనం ఇస్తున్నారని ఆవేదన
ఇవాళ ఏపీ సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్రస్థాయి భేటీ జరిగింది. ఈ సమావేశం ద్వారా ఆయా సంఘాల నేతలు పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. కేంద్రం పంపిన 14వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బకాయిల కింద జమ చేసుకున్నామన్న ప్రభుత్వ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. రూ.8,660 కోట్లను పంచాయతీలకు తిరిగి జమ చేయాలని స్పష్టం చేశారు. 

సర్పంచుల కంటే వాలంటీర్లకు, ఆయాలకే ఎక్కువ వేతనం అందుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్, ఎంపీటీసీలకు రూ.15 వేల గౌరవవేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ, జడ్పీటీసీలకు రూ.30 వేల గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

మున్సిపల్ కౌన్సిలర్లకు రూ.20 వేలు, కార్పొరేటర్లకు రూ.30 వేలు, మున్సిపల్ చైర్మన్ కు రూ.1 లక్ష, జడ్పీ కార్పొరేషన్ చైర్మన్లకు రూ.2 లక్షలు గౌరవ వేతనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు.


More Telugu News