రేపటి నుంచి నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన
- ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమాల్లో పాల్గొంటారన్న టీడీపీ
- మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తారని వెల్లడి
- కావలిలో టీడీపీ ఫ్లెక్సీల తొలగింపుపై విమర్శలు
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ తలపెట్టిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొనేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 28న కందుకూరులో, 29న కావలిలో, 30న కోవూరులో జరిగే ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా వివిధ వర్గాల ప్రజలతో చంద్రబాబు సమావేశం అవుతారని చెప్పారు.
చంద్రబాబు పర్యటనకు జగన్ సర్కారు అడ్డంకులు కలిగిస్తోందని రవిచంద్ర ఆరోపించారు. కావలిలో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా తొలగించారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని విమర్శించారు. కందుకూరు, కావలిలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో నియోజకవర్గ ఇన్ చార్జి ఇంటూరు నాగేశ్వరరావు స్థానిక నేతలతో సమావేశం నిర్వహించారు. చంద్రబాబు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలిరావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు సభ, బస ప్రాంతాలను సోమవారం టీడీపీ ముఖ్యనేతలు పరిశీలించారు.