కంచె దూకి కారుపై చిరుత దాడి.. వీడియో ఇదిగో!

  • అసోంలోని రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆవరణలో ఘటన
  • అటవీ శాఖ సిబ్బంది ప్రయాణిస్తున్న కారుపై దూకిన చిరుత
  • ముగ్గురు సిబ్బంది సహా 15 మందికి గాయాలు
అసోంలోని జోర్హాట్ లో ఓ కారులో ప్రయాణిస్తున్న వారిపై చిరుత దాడి చేసింది. అడ్డుగా ఉన్న కంచె పైనుంచి ఎగిరి దూకిన చిరుత.. కారుపై దాడి చేసి పారిపోవడాన్ని అటవీ శాఖ సిబ్బంది మొబైల్ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరుత దాడిలో అటవీశాఖ అధికారులు ముగ్గురు సహా మొత్తం 15 మందికి గాయాలయ్యాయి.

జోర్హాట్ శివార్లలో రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఆర్ఎఫ్ఆర్ఐ) క్యాంపస్ ఉంది. అడవి పక్కనే ఉండడంతో తరచుగా చిన్నచిన్న జంతువులు ఈ క్యాంపస్ లోకి వస్తుంటాయి. క్రూర జంతువులు క్యాంపస్ లోకి రాకుండా అధికారులు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. తాజాగా, ఈ క్యాంపస్ లోకి చిరుత ఎంటరైంది. కంచె పై నుంచి ఎగిరి దూకి కారుపై దాడి చేసింది. క్యాంపస్ లో పరుగులు తీస్తూ కనిపించిన వారిపై ఎగబడింది. ఈ ఘటనలో పిల్లలు, మహిళలు, అటవీ అధికారులు సహా మొత్తం 15 మందికి గాయాలయ్యాయి. చిరుతను బంధించి అడవిలో వదిలేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.


More Telugu News