మాస్కులు ధరించాలి: కొవిడ్ పై సీఎం జగన్ సమీక్ష
- దేశంలో మళ్లీ కొవిడ్ వ్యాప్తి
- ఈసారి బీఎఫ్-7 సబ్ వేరియంట్ తో కలకలం
- విదేశాల్లో భారీగా కేసులు
- అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం
పలు దేశాల్ల కరోనా వైరస్ మళ్లీ ఉద్ధృతమవుతోందన్న వార్తల నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. దేశంలోనూ ఒమిక్రాన్ బీఎఫ్-7 రకం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగుచూస్తుండడంతో, సీఎం జగన్ నేడు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
మాస్కులు ధరించడం తదితర కొవిడ్ నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన కలిగించాలని పేర్కొన్నారు. అనుమానాస్పద కేసుల్లో తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఆసుపత్రుల్లో ఉన్న సౌకర్యాలపై మరోసారి విసృతస్థాయిలో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.
కరోనా చికిత్స, నివారణ చర్యల్లో విలేజ్ క్లినిక్ లు కేంద్రంగా కార్యాచరణ ఉండాలని వివరించారు. కరోనా పరీక్షలు, వైద్యసాయం విలేజ్ క్లినిక్ కేంద్రంగా జరగాలని... ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు అందరూ విలేజ్ క్లినిక్ కేంద్రంగా అందుబాటులో ఉండాలని సీఎం జగన్ తెలిపారు. విలేజ్ క్లినిక్కులు మొదలుకుని ప్రజా ఆరోగ్య కేంద్రాలు, బోధనాసుపత్రుల వరకు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం అందుబాటులో ఉండాలని, ఎక్కడా మందుల కొరత అన్నమాటే రాకూడదని స్పష్టం చేశారు.
వైద్య ఆరోగ్య శాఖలో వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాలు జనవరి 26 నాటికి పూర్తి కావాలని అన్నారు.