ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఫోన్
- మోదీ, జెలెన్ స్కీ మధ్య టెలిఫోన్ సంభాషణ
- తమ శాంతి విధానాన్ని భారత్ ముందుకు తీసుకోవాలన్న జెలెన్ స్కీ
- జీ20 అధ్యక్ష బాధ్యతల నేపథ్యంలో మోదీకి శుభాకాంక్షలు
ఇవాళ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ లో సంభాషించినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ వెల్లడించారు. తమ శాంతికాముక విధానం అమలులో భారత్ భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నామని తెలిపారు. జీ20 అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించాలంటూ మోదీకి శుభాకాంక్షలు తెలిపినట్టు వివరించారు.
గతంలో తాను ఇదే జీ20 వేదికపై తమ శాంతి కార్యాచరణను ప్రకటించామని, ఇప్పుడు దాన్ని అమలు చేయడంలో భారత్ తన వంతు పాత్రను పోషిస్తుందని భావిస్తున్నామని జెలెన్ స్కీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాకుండా, సంక్షోభ సమయంలో మానవతా సాయం అందించినందుకు, ఐక్యరాజ్యసమితిలో మద్దతుగా నిలిచినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపినట్టు వివరించారు.
ఉక్రెయిన్ పై రష్యా గత ఫిబ్రవరి 24 నుంచి దాడులు చేస్తుండగా, భారత ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీలతో పలుమార్లు మాట్లాడారు. చర్చల ద్వారానే సమస్య పరిష్కరించుకోవాలని ఇరుదేశాల అధినేతలకు సూచించారు.