విద్యాసంస్థలు, థియేటర్లలో మాస్కులు తప్పనిసరి చేసిన కర్ణాటక ప్రభుత్వం

  • భారత్ లో బీఎఫ్-7 కలకలం
  • సబ్ వేరియంట్ నేపథ్యంలో నిపుణుల హెచ్చరికలు
  • అప్రమత్తమైన రాష్ట్రాలు
  • రాత్రి 1 గంట లోపే నూతన సంవత్సర వేడుకలు
  • కర్ణాటకలో ఆదేశాలు
దేశంలో మరోసారి కరోనా వ్యాప్తి పట్ల ఆందోళనలు నెలకొన్నాయి. ఒమిక్రాన్ బీఎఫ్-7 సబ్ వేరియంట్ తో ముప్పు ఉందన్న నిపుణుల హెచ్చరికలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో, కర్ణాటక ప్రభుత్వం కొవిడ్ నిబంధనలను మళ్లీ తెరపైకి తెచ్చింది. స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లలో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కేశవ సుధాకర్ వెల్లడించారు. 

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పబ్ లు, రెస్టారెంట్లు, బార్లలో కచ్చితంగా మాస్కులు ధరించాలని, నూతన సంవత్సర వేడుకలు రాత్రి ఒంటి గంట లోపే ముగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వేడుకలు జరిగే చోట పరిమితికి మించి జనం గుమికూడరాదని అన్నారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని మంత్రి కేశవ సుధాకర్ తెలిపారు.


More Telugu News