నలుగురు విదేశీయులకు కొవిడ్ పాజిటివ్.. గయ ఎయిర్ పోర్ట్ లో అప్రమత్తం

  • చైనా నుంచి కరోనాతో వచ్చిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి స్థిరం
  • అతడ్ని ట్యాక్సీలో తీసుకెళ్లిన డ్రైవర్ గుర్తింపు
  • కరోనాపై ఇండియన్ మెడికల్ కౌన్సిల్ తో కేంద్ర ఆరోగ్య మంత్రి సమీక్ష
మన దేశంలో కరోనా అదుపులోనే ఉంది. ఆదివారం దేశవ్యాప్తంగా 196 కొత్త కేసులు వెలుగు చూశాయి. రికవరీ రేటు 98.8 శాతంగా ఉంది. అంటే వైరస్ బారిన పడిన ప్రతి 100 మందిలో ఒక్కరే కోలుకోవడం ఆలస్యమవుతోంది. మరోవైపు బీహార్ లోని గయ విమానాశ్రయంలో నిర్వహించిన పరీక్షల్లో నలుగురు విదేశీ పర్యాటకులకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అక్కడ అప్రమత్తత ప్రకటించారు. తోటి ప్రయాణికులను గుర్తించి, పరీక్షలు నిర్వహించనున్నారు.

చైనా నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న కరోనా పాజిటివ్ వ్యక్తిని, అక్కడి నుంచి ట్యాక్సీలో ఆగ్రా తీసుకెళ్లిన డ్రైవర్ ను గుర్తించారు. చైనా నుంచి వచ్చిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. అతడితో సన్నిహితంగా మెలిగిన 27 మంది నమూనాలను పరీక్షల కోసం పంపించారు. మరోవైపు నైనిటాల్ హైకోర్టు మాస్క్ లు ధరించే విధులకు హాజరు కావాలంటూ సిబ్బంది, న్యాయవాదులను ఆదేశించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ కరోనాపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తో నేడు ఒక సమావేశం నిర్వహించనున్నారు.


More Telugu News