మళ్లీ పంచ్ పవర్ చూపించిన నిఖత్ జరీన్.. జాతీయ బాక్సింగ్ చాంపియన్ గా తెలంగాణ బాక్సర్
- భోపాల్ లో జరిగిన టోర్నీలో జయకేతనం
- ఫైనల్లో రైల్వేస్ బాక్సర్ అనామికపై గెలుపు
- ఈ ఏడాది ఆడిన అన్ని టోర్నీల్లో గెలిచిన వైనం
భారత స్టార్ బాక్సర్, తెలంగాణ యువ క్రీడాకారిణి నిఖత్ జరీన్ మరోసారి తన పంచ్ పవర్ చూపెట్టింది. భోపాల్ వేదికగా జరిగిన జాతీయ మహిళల బాక్సింగ్ చాంపియన్ షిప్ లో బంగారు పతకం సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో 50 కిలోల విభాగం పైనల్లో నిఖత్ 4–1 తేడాతో రైల్వేస్ క్రీడాకారిణి అనామికను చిత్తుగా ఓడించి చాంపియన్ గా నిలిచింది. దాంతో, ఈ ఏడాది ఆడిన అన్ని టోర్నమెంట్లలోనూ గెలిచిన నిఖత్ అజేయంగా నిలిచినట్టయింది.
ఈ ఏడాది ఆరంభంలో స్ట్రాంజా మెమోరియల్ టోర్నమెంట్ లో పసిడి గెలిచిన నిఖత్ తర్వాత ప్రపంచ చాంపియన్ షిప్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఆపై, కామన్వెల్త్ క్రీడల్లోనూ పసిడి పతకం సొంతం చేసుకున్న నిఖత్ ఇప్పుడు జాతీయ చాంపియన్ షిప్ కూడా గెలిచి ఔరా అనిపించింది.