సీఎస్కే లో బెన్ స్టోక్స్ ఫిట్ అవుతాడా..?.. గేల్ విశ్లేషణ ఇదీ..!

  • గొప్పగా ఇమిడిపోతాడన్న గేల్
  • యువ ఆటగాళ్లు స్టోక్స్ నుంచి ఎంతో నేర్చుకోవచ్చన్న అభిప్రాయం
  • ఆల్ రౌండర్ల కొరత తీరుతుందన్న విశ్లేషణ
ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు కప్టెన్ బెన్ స్టోక్స్ ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు (సీఎస్కే) రూ.16.25 కోట్లు వెచ్చించి తాజా ఐపీఎల్ మినీ వేలంలో కొనుగోలు చేసింది. అంత ఖర్చు పెట్టి స్టోక్స్ ను తీసుకోవడం వల్ల సీఎస్కే లాభపడనుందా? సీఎస్కేలో స్టోక్స్ ఫిట్ అవుతాడా? ఈ ప్రశ్నలను జియో సినిమాస్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ కు ఎదురయ్యాయి. 

స్టోక్స్ ను తీసుకోవడం వల్ల సీఎస్కే ఎంతో ప్రయోజనం పొందుతుందని గేల్ అభిప్రాయపడ్డాడు. స్టోక్స్, ధోనీని అద్భుతమైన ఆటగాళ్లుగా పేర్కొన్నాడు. సీఎస్కేలో యువ ఆటగాళ్లు స్టోక్స్ నుంచి ఎంతో నేర్చుకోవచ్చన్నాడు. అతడ్ని జట్టులో కలిగి ఉండడం ప్రయోజనమని, డీజే బ్రావో స్థానాన్ని భర్తీ చేస్తాడని గేల్ చెప్పాడు. ‘‘సంస్కృతిలో కలసి పోవడం కీలకం. అతడికి (స్టోక్స్) ఉన్న అనుభవంతో సూపర్ కింగ్స్ లో గొప్పగా ఇమిడిపోతాడు. వారికి ఆల్ రౌండర్ల


More Telugu News