రాష్ట్రపతికి స్వాతగం పలకని ముఖ్యమంత్రి కేసీఆర్
- హైదరాబాద్ కు విచ్చేసిన ద్రౌపది ముర్ము
- స్వాగతం పలికిన తమిళిసై, సత్యవతి రాథోడ్
- శ్రీశైలంకు బయల్దేరిన రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు విచ్చేశారు. ఆమెకు గవర్నర్ తమిళిసై, రాష్ట్ర ప్రభుత్వం తరపున సత్యవతి రాథోడ్ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపతికి స్వాగతం పలకకపోవడం చర్చకు దారితీసింది. హైదారాబాద్ నుంచి రాష్ట్రపతి హెలికాప్టర్ లో శ్రీశైలంకు బయల్దేరారు. ఆమెతో పాటు గవర్నర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వెళ్లారు.
మరోపక్క, రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో శ్రీశైలంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఆలయ పరిధిలోని ప్రధాన కూడళ్లలో బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. భక్తులకు భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనాన్ని నిలిపివేశారు. స్వామివారిని రాష్ట్రపతి దర్శించుకున్న అనంతరం భక్తులకు దర్శనాలు పునఃప్రారంభమవుతాయి.