అరుదైన మూలికల కోసమే చైనా సైన్యం చొరబడిందట.. ఇండో పసిఫిక్ సెంటర్ నివేదికలో వెల్లడి
- ఈ మూలికల ఉత్పత్తిలో నెంబర్ వన్ గా చైనా
- తమ దేశంలో కొరత ఏర్పడడంతో మూలికల సేకరణకు బార్డర్ దాటిన సైనికులు
- అంతర్జాతీయ మార్కెట్ లో వీటి విలువ వెయ్యి డాలర్ల పైనేనంటున్న నిపుణులు
హిమాలయాల్లో దొరికే అత్యంత అరుదైన మూలికల కోసమే చైనా సైన్యం ఇటీవల సరిహద్దులు దాటొచ్చిందని ఇండో పసిఫిక్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్(ఐపీసీఎస్ సీ) నివేదిక వెల్లడించింది. హిమాలయన్ గోల్డ్ గా పిలిచే ఈ గొంగళి పురుగు ఫంగస్ ను మందుల తయారీకి ఉపయోగిస్తారని పేర్కొంది. పుట్టగొడుగులలో అరుదైన రకానికి చెందిన ఈ మూలికను మన దేశంలో కీడా జాడీగా, చైనా, పాక్ లలో యర్సగుంబాగా పిలుస్తారని తెలిపింది.
అత్యంత అరుదుగా లభించే ఈ మూలికలో అద్భుతమైన ఔషధ విలువలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటి తయారీ, ఉత్పత్తిలో ప్రపంచంలో నెంబర్ వన్ దేశం చైనానే. దీని విలువ బంగారం కంటే ఎక్కువని, 10 గ్రాముల ఈ ఫంగస్ విలువ సుమారు రూ. 56 వేలకు పైనే ఉంటుందని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్ లో ఈ ఫంగస్ విలువ వెయ్యి మిలియన్ డాలర్లు ఉంటుందని వివరించారు.
చైనాలోని కింగై-టిబెట్ ప్రాంతంతో పాటు మన హిమాలయాల్లో ఈ గొంగళి పురుగు ఫంగస్ ఎక్కువగా దొరుకుతుంది. ఇటీవలి కాలంలో కింగై ప్రాంతంలో ఈ ఫంగస్ కు కొరత ఏర్పడింది. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ పెరగడంతో చైనా సైనికులు ఈ ఫంగస్ కోసం బార్డర్ దాటి అరుణాచల్ ప్రదేశ్ లోకి చొరబడినట్లు ఐపీసీఎస్ సీ నివేదిక పేర్కొంది.