షర్మిలవి తెలిసీ తెలియని రాజకీయాలు: డీకే అరుణ
- ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ షోకు హాజరైన డీకే అరుణ
- షర్మిలతో తనకు గొడవల్లేవని స్పష్టీకరణ
- బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చేందుకు మంత్రులు కూడా సిద్ధంగా ఉన్నారని వెల్లడి
- ముఖ్యమంత్రి అయ్యే అర్హత తనకు కూడా ఉందన్న అరుణ
షర్మిలవి తెలిసీ తెలియని రాజకీయాలని, ఆమె మాట్లాడిన ప్రతీ దానికి స్పందించడం సరికాదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ షోకు హాజరైన అరుణ మాట్లాడుతూ ఈ వాఖ్యలు చేశారు. షర్మిలతో మీకు గొడవ ఎందుకు వచ్చిందన్న రాధాకృష్ణ ప్రశ్నకు అరుణ స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. నిజానికి తమ మధ్య వివాదం ఎప్పుడూ లేదన్నారు. తెలంగాణ సెంటిమెంటు ఉంటుంది కాబట్టి ప్రజలు స్వాగతించరని తాను చెబితే ఆమె ఏమోమో మాట్లాడారని గుర్తు చేసుకున్నారు. దానికి తాను స్పందించలేదన్నారు.
పోలీసులు ఇటీవల ఆమెను టోయింగ్ వాహనంలో తీసుకెళ్లడం, దానికి మోదీ స్పందించడం అసాధారణం కాదా? అన్న మరో ప్రశ్నకు.. వాస్తవంగా ఏం జరిగిందన్నది తమకు తెలియదని, అదంతా మీడియాలో వచ్చినదేనని పేర్కొన్నారు. చంద్రబాబు, షర్మిల, పవన్ ముగ్గురూ బీజేపీ ప్రయోగిస్తున్న బాణాలేనంటూ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై మీ అభిప్రాయం ఏమిటన్న ప్రశ్నకు అరుణ స్పందిస్తూ.. ఎన్నికలు దగ్గర పడుతుంటే ఇలాంటి చర్చలు తెరపైకి చాలానే వస్తుంటాయని కొట్టిపడేశారు. ప్రస్తుతానికైతే ఒంటరిగానే పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించినట్టు చెప్పారు.
బీజేపీలోకి వచ్చేందుకు బీఆర్ఎస్ నేతలు చాలామందే సిద్ధంగా ఉన్నారని, వారిలో మంత్రులు కూడా ఉన్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి మీరేనా? అన్న మరో ప్రశ్నకు అరుణ బదులిస్తూ.. సీఎం అభ్యర్థి గురించి పార్టీలో ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదన్నారు. ముందైతే పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అన్నారు. రాజకీయాల్లో ఎవరైనా సరే ఎదగాలనే అనుకుంటారని, ముఖ్యమంత్రి కావాలని అనుకుంటారని అన్నారు. తనకు కూడా ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందనే అనుకుంటున్నానని అరుణ పేర్కొన్నారు.