అల్పపీడన ప్రభావం.. నేడు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు!
- ఉత్తర శ్రీలంకలో తీరం దాటిన వాయుగుండం
- అల్పపీడనంగా బలపడి నేడు కొమెరిన్ తీరానికి
- ఏజెన్సీలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
దక్షిణ కోస్తా, రాయలసీమల్లో నేడు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ నైరుతి వైపుగా పయనించి నిన్న ఉత్తర శ్రీలంకలో తీరం దాటి తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ నైరుతి తీరం దిశగా పయనించి నేటి ఉదయానికి కొమెరిన్ తీరం దిశగా వస్తుందని అధికారులు తెలిపారు.
దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. నేడు కూడా దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు, ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, చింతపల్లి, అరకులోయ ఏజెన్సీ ప్రాంతాలను చలి భయపెడుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. పాడేరు సమీపంలోని జి.మాడుగులలో నిన్న 5.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.