విశాఖలో జనవరి 27న లక్ష మందితో ప్రజాగర్జన: విశాఖ ఉక్కు పోరాట కమిటీ

  • కేంద్రం నిరంకుశ వైఖరికి నిరసనగా ‘ప్రజాగర్జన’
  • 32 మంది అమరుల త్యాగంతో సాధించుకున్న ఫ్యాక్టరీని కాపాడుకుంటామని ప్రతిన
  • జల్లికట్టు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాటంలో పాల్గొనాలని పిలుపు
అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది జనవరి 27న విశాఖపట్టణంలో లక్ష మందితో ‘ప్రజా గర్జన’ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు విశాఖ ఉక్కు పోరాట కమిటీ నేతలు తెలిపారు. ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టు చెప్పారు. 32 మంది అమరుల త్యాగంతో సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు.

కరోనా సమయంలోనూ కార్మికులు ప్రాణాలకు తెగించి పనిచేశారని, సొంత మైన్స్ లేకపోయినా ఫ్యాక్టరీని లాభాలో బాటలో నడిపించారని పేర్కొన్నారు. రాష్ట్రానికి స్టీల్‌ప్లాంట్ ఆర్థిక వనరు అని, దేశానికే తలమానికమని అన్నారు. తమిళనాడు జల్లికట్టు, తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.


More Telugu News