నన్ను లొంగదీసుకునేందుకు ఈడీతో విచారణ చేయిస్తున్నారు: రోహిత్ రెడ్డి
- తొలి రోజు నన్ను ఆరు గంటల పాటు విచారించారు
- రెండో రోజు ఎమ్మెల్యేల కొనుగోలు అంశం గురించి ప్రశ్నించారు
- నందకుమార్ ద్వారా పెద్ద ప్లాన్ వేశారని విమర్శ
ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు మీడియాతో రోహిత్ రెడ్డి మాట్లాడుతూ, తనను లొంగదీసుకునేందుకే ఈడీతో బీజేపీ విచారణ జరిపిస్తోందని చెప్పారు. తొలిరోజు తనను ఆరు గంటల పాటు విచారించారని... ఏ కేసులో ప్రశ్నిస్తున్నారో కూడా చెప్పలేదని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశం గురించి రెండో రోజు ప్రశ్నించారని చెప్పారు.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఫిర్యాదు చేసిన తనను విచారిస్తున్నారని... నిందితులను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. ఈ కేసులో నిందితుడైన నంద కుమార్ ద్వారా పెద్ద ప్లాన్ వేశారని... ఆయన ద్వారా స్టేట్ మెంట్ తారుమారు చేయబోతున్నారని చెప్పారు. ఈడీ, ఐటీ, సీబీఐలతో కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందని విమర్శించారు.