గాలి జనార్దన్ రెడ్డి బీజేపీని వీడటానికి కారణం ఇదే!

- కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో పార్టీని ప్రకటించిన జనార్దన్ రెడ్డి
- వచ్చే ఎన్నికల్లో గంగావతి నుంచి పోటీ
- తన భార్యతో కలిసి గంగావతిలో పర్యటిస్తున్న గాలి
బళ్లారి ఐరన్ ఓర్ మైనింగ్ దిగ్గజం గాలి జనార్దన్ రెడ్డి సొంత రాజకీయ పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. 'కల్యాణ రాజ్య ప్రగతి పక్ష' పేరుతో రాజకీయ పార్టీని ఆయన ప్రకటించారు. 2023 కర్ణాటక అసెంబ్లీలో గంగావతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. గంగావతిలో ఇప్పటికే ఆయన రాజకీయ కార్యాచరణను ప్రారంభించారు. తన భార్యతో కలిసి గంగావతి నియోజకర్గంలో పర్యటనలు చేస్తున్నారు.
ఇటీవలే గంగావతిలోని ఓ అభివృద్ధి కార్యక్రమానికి రూ. 6 కోట్ల విరాళం ఇవ్వనున్నట్టు జనార్దన్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటన బీజేపీ శ్రేణుల్లో అసంతృప్తికి కారణమయిందని తెలుస్తోంది. దీంతో ఆయన బీజేపీ నాయకత్వానికి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన కొత్త పార్టీని ప్రకటించారు. మరోవైపు అక్రమ గనుల తవ్వకాల కుంభకోణంలో జనార్దన్ రెడ్డి నాలుగేళ్లు జైల్లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన సుప్రీంకోర్టు ఇచ్చిన కండిషనల్ బెయిల్ పై బయట ఉన్నారు.