కరోనా కేసుల పెరుగుదలతో ప్రజలకు ప్రధాని సూచనలు
- మాస్క్ లు ధరించండి, చేతులను శుభ్రం చేసుకోండంటూ పిలుపు
- మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన ప్రధాని
- చాలా దేశాల్లో కేసులు పెరుగుతున్నందున జాగ్రత్తగా ఉండాలని సూచన
పొరుగుదేశం చైనాలో కరోనా కేసులు పెరిగిపోతుండడం పట్ల కేంద్రం ముందస్తు జాగ్రత్త చర్యలను తీవ్రతరం చేసింది. ప్రజలు వైరస్ నుంచి సురక్షితంగా ఉండేందుకు వీలుగా నివారణ చర్యలు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆయన సూచన చేశారు. ‘‘చాలా దేశాల్లో కరోనా కేసులు పెరిగిపోతుండడాన్ని చూస్తున్నాం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మాస్క్ లు ధరించి, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి’’అని ప్రధాని కోరారు.
మరోవైపు ఆరోగ్య సదుపాయాల సన్నద్ధతను తెలుసుకునేందుకు మంగళవారం నుంచి మాక్ డ్రిల్స్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది. ఒకేసారి కేసులు పెరిగిపోతే వచ్చే రోగులకు చికిత్స అందించేందుకు వీలుగా సదుపాయాలను సిద్ధం చేసుకోవాలని సూచించింది. తగినంత ఆక్సిజన్ నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, లైఫ్ సపోర్ట్ యాంత్రాల పనితీరును చెక్ చేసుకోవాలని కోరింది. మరోవైపు ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చే విదేశీ ప్రయాణికులను ర్యాండమ్ గా పరీక్షిస్తున్నారు. శనివారం సుమారు 25 వేల మంది ప్రయాణికులు రాగా, వారిలో 500 మందిని పరీక్షించారు.