దేశ ప్రజలకు సీఎం కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు
- క్రీస్తు బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం చేస్తాయన్న కేసీఆర్
- క్రీస్తు బోధనలు ఆచరణీయమన్న సీఎం
- ఏసుక్రీస్తు దీవెనలు అందరికీ లభించాలని ఆకాంక్ష
క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, కరుణ, సహనం, ప్రేమ విలువలను ప్రపంచానికి చాటిన ఏసుక్రీస్తు బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం చేస్తాయని కేసీఆర్ తెలిపారు.
ఒకవైపు శాస్త్ర, సాంకేతిక రంగాలు గొప్పగా పురోగమిస్తున్నా... మరోవైపు మానవీయ విలువలు మృగ్యమైపోతున్న నేటి కాలంలో క్రీస్తు బోధనలు ఆచరణీయమైనవని చెప్పారు. ఏసుక్రీస్తు దీవెనలు ప్రజలందరికీ అభించాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర, దేశ ప్రజలందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలను తెలియజేశారు.