ప్రతి గ్రామంలో దళితులకు శ్మశానవాటిక: జగన్

  • దళితుల జనాభాను బట్టి అర ఎకరం నుంచి ఎకరం స్థలంలో శ్మశానవాటిక
  • ప్రభుత్వ భూమి లేకపోతే రైతుల నుంచి భూసేకరణ
  • 45 రోజుల్లో ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశం
దళితులకు ప్రతి గ్రామంలో శ్మశానవాటిక ఉండాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో, దళితులు ఉన్న ప్రతి గ్రామంలో తగిన భూమిని గుర్తించాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేశారు. గ్రామంలోని దళితుల జనాభాను బట్టి అర ఎకరం నుంచి, ఎకరం స్థలాన్ని గుర్తించాలని చెప్పారు. ఆ తర్వాత ఆ స్థలాన్ని గ్రామ పంచాయతీలకు అప్పగించే ప్రక్రియను చేపట్టాలని తెలిపారు. 

ఎక్కడైనా ప్రభుత్వ భూములు లేకపోతే గ్రామంలోని రైతుల నుంచి భూమిని సేకరించి, వారికి వేరే చోట భూమిని ఇవ్వడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. 45 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. అన్నీ పూర్తయిన తర్వాత శ్మశానవాటికలను లాంఛనంగా ప్రారంభించాలని చెప్పారు.


More Telugu News