తెలంగాణలో హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

  • హార్టికల్చర్ లో బీఎస్సీ చేసిన అభ్యర్థులు అర్హులు  
  • నోటిఫికేషన్ జారీ చేసిన టీఎస్ పీఎస్ సీ
  • జనవరి 24 తో ముగియనున్న దరఖాస్తు గడువు
తెలంగాణలో హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్ సీ) తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు ఇది చక్కని అవకాశం. హార్టికల్చర్ లో డిగ్రీ చేసిన అభ్యర్థులకు నెలకు రూ.లక్షకు పైగా జీతం అందించే ప్రభుత్వ ఉద్యోగమిది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో వచ్చే నెల 3 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు తుది గడువు జనవరి 24 తో ముగుస్తుంది.

ఉద్యోగ ఖాళీలు, నియామక పక్రియ, దరఖాస్తు విధానం తదితర వివరాలు..

  • హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు మొత్తం ఖాళీలు 22
  • హార్టికల్చర్ లో బీఎస్సీ చేసిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి
  • 01-07-2022 నాటికి 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి
  • అర్హతగల అభ్యర్థులు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి
  • రాతపరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
  • ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి పే స్కేలు రూ.51,320 నుంచి 1,27,310
  • దరఖాస్తులకు తుది గడువు 2023 జనవరి 24
  • పరీక్ష తేది 04-04-02023


More Telugu News