కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది: ఇంద్రకరణ్ రెడ్డి

  • వివిధ పార్టీలతో కలిసి బీఆర్ఎస్ అధికారాన్ని చేపడుతుందన్న ఇంద్రకరణ్
  • త్వరలోనే దేశానికి బీజేపీ పీడ విరగడవుతుందని వ్యాఖ్య
  • రైతుల పట్ల కేంద్రం అన్యాయంగా వ్యవహరిస్తోందని మండిపాటు
బీఆర్ఎస్ పార్టీకి పలు రాష్ట్రాల్లో మద్దతు లభిస్తోందని తెలంగాణ అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. దేశంలో వివిధ పార్టీలతో కలిసి బీఆర్ఎస్ అధికారాన్ని చేపడుతుందని చెప్పారు. త్వరలోనే దేశానికి బీజేపీ పీడ విరగడవుతుందని అన్నారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం చాలా అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. రైతు లేకపోతే రాజ్యమే లేదని అన్నారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని చెప్పారు. కల్లాల నిర్మాణాలకు కూడా ఉపాధి హామీ నిధులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 

తెలంగాణ రైతులపై కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత వైఖరికి నిరసనగా నిర్మల్ లో బీఆర్ఎస్ నేతలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రేఖా శ్యాంనాయక్, విఠల్ రెడ్డి, జిల్లాపరిషత్ చైర్ పర్సన్ విజయలక్ష్మి రెడ్డి, ఇతర నేతలు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.


More Telugu News