ఏపీలో ప్రతి రైతు కుటుంబంపై రూ. 2.45 లక్షల అప్పు: కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్
- తెలంగాణలో రైతుల తలసరి అప్పు రూ. 1,52,113
- సరాసరి అప్పు రూ. 2 లక్షల కంటే ఎక్కువున్న రాష్ట్రాలు మూడు
- తొలి స్థానంలో ఏపీ.. ఐదో స్థానంలో తెలంగాణ
రైతుల రుణ భారంలో దేశంలోనే ఏపీ అగ్ర స్థానంలో ఉంది. ప్రతి రైతు కుటుంబంపై తలసరి రుణ భారం రూ. 2,45,554 అప్పు ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ రాజ్యసభలో ప్రకటించారు. జాతీయ స్థాయిలో తలసరి అప్పు రూ. 74,121 ఉందని చెప్పారు. రెండు, మూడు స్థానాల్లో కేరళ, పంజాబ్ ఉండగా... రూ. 1,52,113 తలసరి అప్పుతో తెలంగాణ ఐదో స్థానంలో ఉందని వెల్లడించారు. తలసరి రుణ భారం రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఏపీ, కేరళ, పంజాబ్ ఉన్నాయి. జాతీయ సగటు కంటే ఏపీ అప్పు మూడు రెట్లు, తెలంగాణ అప్పు రెండు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.
2008-09లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రుణమాఫీ చేసిందని.. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ చేయలేదని తోమర్ తెలిపారు. అయితే రైతులపై రుణ భారాన్ని తగ్గించేందుకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఏటా రూ. 6 వేలు అందిస్తున్నామని చెప్పారు. మరోవైపు సగటు రుణ భారం రూ. లక్షకు పైగా ఉన్న రాష్ట్రాలు ఎనిమిది ఉండగా... ఆ జాబితాలో దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాలు ఉండటం గమనార్హం.