నెట్ ఫ్లిక్స్ లో పాస్ వర్డ్ షేర్ చేస్తే చార్జీ!
- కుటుంబ సభ్యుల వరకే పాస్ వర్డ్ షేరింగ్
- బయటి వ్యక్తులతో షేర్ చేసుకోవడానికి బ్రేక్
- కొంత చార్జీ చెల్లించడం ద్వారా అనుమతించే అవకాశం
నెట్ ఫ్లిక్స్ యూజర్లు ఇప్పటి వరకు తమ పాస్ వర్డ్ ను స్నేహితులు, తెలిసిన ఇతరులతో షేర్ చేసుకుంటున్నారు. కానీ, ఇక మీదట ఇది కుదరదు. జనవరి నుంచి పాస్ వర్డ్ షేరింగ్ ను నెట్ ఫ్లిక్స్ కట్టడి చేస్తోంది. కేవలం అదే కుటుంబ సభ్యులకు తప్ప ఇతరులతో షేర్ చేసుకోవడానికి ఉండదు. ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది.
నెట్ ఫ్లిక్స్ ఆదాయం పడిపోవడంతో పాస్ వర్డ్ షేరింగ్ ను నియంత్రించేందుకు సంస్థ కొత్త విధానాన్ని తీసుకొస్తోంది. పదేళ్లలో మొదటిసారిగా నెట్ ఫ్లిక్స్ ఈ ఏడాది ఆరంభంలో చందాదారులను కోల్పోయింది. దీంతో పాస్ వర్డ్ షేరింగ్ ను కట్టడి చేస్తామని సంస్థ సీఈవో రీడ్ హాస్టింగ్ లోగడే ప్రకటించారు. ఇందులో భాగంగానే జనవరి నుంచి పాస్ వర్డ్ షేరింగ్ ను నిలిపివేయనుంది. అయితే అదే సమయంలో కొంత చార్జీ చెల్లించి పాస్ వర్డ్ ను ఇతరులతో షేర్ చేసుకునే విధానాన్ని ప్రకటించొచ్చని సమాచారం. కుటుంబ సభ్యులు కాకుండా, బయటి వారు పాస్ వర్డ్ ను వినియోగించేట్టు అయితే చార్జీ చెల్లించాలి.