ప్రయాణికుడికి గుండెపోటు.. సీపీఆర్ చేసి బతికించిన భద్రతా సిబ్బంది
- అహ్మదాబాద్ విమానాశ్రయంలో చోటు చేసుకున్న ఘటన
- సబ్ ఇన్ స్పెక్టర్ వేగంగా స్పందించడంతో నిలిచిన ప్రాణం
- అభినందించిన బీజేపీ జాతీయ కార్యదర్శి దియోదర్
అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడు గుండెపోటు కారణంగా కుప్పకూలిపోగా.. భద్రతా సిబ్బంది కాపాడారు. సదరు ప్రయాణికుడు ముంబై వెళ్లాల్సి ఉంది. గుండె పోటుతో పడిపోవడంతో విమానాశ్రయ భద్రతను చూసే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) సబ్ ఇన్ స్పెక్టర్ కపిల్ రాఘవ్ చురుగ్గా స్పందించారు.
నేలపై సమాంతరంగా పడుకోబెట్టి కార్డియో పల్మనరీ రీససిటేషన్ (సీపీఆర్) నిర్వహించారు. దీంతో సదరు ప్రయాణికుడికి ప్రాణం లేచి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను సీఐఎస్ఎఫ్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ పై ఓ జవాను షేర్ చేశారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ సైతం తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. ‘‘సీఎఫ్ఎస్ఎఫ్ జవాను సత్వర స్పందన అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఓ ప్రాణాన్ని కాపాడింది. ఈ గొప్ప దళానికి వందనాలు’’ అంటూ దేవధర్ పోస్ట్ పెట్టారు.
సీపీఆర్ అన్నది ఎవరైనా చేయగలిగిన ప్రక్రియ. గుండె పోటు వచ్చిన వారికి వెంటనే దీన్ని నిర్వహించడం ద్వారా వారి గుండెను తిరిగి పనిచేసేలా చేయవచ్చు. ఆ తర్వాత వెంటనే హాస్పిటల్ కు తరలించడం ద్వారా ప్రాణాలను పూర్తిగా కాపాడవచ్చు. దీనిని ఎలా చేయాలనే దానిపై అవగాహన కల్పించే లక్ష్యంతో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ, దర్శకుడు రాజమౌళితో కలసి గతంలో ఓ వీడియోను రూపొందించారు.