మారని కేఎల్ రాహుల్ ఆటతీరు.. 10 పరుగులకే ఔట్
- బంగ్లాదేశ్ తో రెండు టెస్టులో ఫెయిలైన ఓపెనర్లు రాహుల్, గిల్
- ఇద్దరినీ ఔట్ చేసి భారత్ ను దెబ్బకొట్టిన బంగ్లా స్పిన్నర్ తైజుల్
- తొలి ఇన్నింగ్స్ లో 227 పరుగులు చేసిన బంగ్లా
బంగ్లాదేశ్ తో రెండో టెస్టులో భారత్ బ్యాటింగ్ లో తడబడింది. స్పిన్నర్లు, పేసర్లు సమష్టిగా రాణించడంతో తొలి రోజే బంగ్లాదేశ్ ను ఆలౌట్ చేసిన టీమిండియాకు తొలి ఇన్నింగ్స్ లో శుభారంభం దక్కలేదు. 19 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం ఆట కొనసాగించిన భారత్ ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి డీలా పడింది. కెప్టెన్ అయినా తన ఆట మార్చుకోలేకపోతున్న కేఎల్ రాహుల్ (10) మరోసారి నిరాశ పరిచాడు. అతనితోపాటు శుభ్ మన్ గిల్ (20) ను కూడా ఔట్ చేసిన బంగ్లాదేశ్ ఎడమ చేతి వాటం స్పిన్నర్ తైజుల్ ఇస్లాం భారత్ ను దెబ్బకొట్టాడు. ఆట మొదలైన ఆరో ఓవర్లోనే కేఎల్ రాహుల్ ను ఎల్బీగా వెనక్కుపంపాడు.
ఇక తొలి టెస్టులో సెంచరీతో అదరగొట్టిన గిల్ ను కూడా తన మరుసటి ఓవర్లోనే వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దాంతో, 38 పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన సీనియర్లు చతేశ్వర్ పుజారా (18 బ్యాటింగ్), విరాట్ కోహ్లీ (10 బ్యాటింగ్) ధాటిగా ఆడుతున్నారు. ఇద్దరూ ఇన్నింగ్స్ ను నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి డ్రింక్స్ విరామ సమయానికి భారత్ 21 ఓవర్లకు 60/2తో నిలిచింది. కాగా, తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 227 పరుగులకే ఆలౌటైంది.