కైకాల సత్యనారాయణ ఇక లేరు.. అనారోగ్యంతో కన్నుమూసిన సీనియర్ నటుడు
- గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణ
- కృష్ణా జిల్లా కౌతవరంలో 1935లో జననం
- నటనపై ఆసక్తితో కాలేజీ రోజుల్లోనే ప్రదర్శనలు
- ‘సిపాయి కూతురు’ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలోకి
గత కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. కైకాల మృతితో తెలుగు చిత్రపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు.
కృష్ణా జిల్లా కౌతవరం గ్రామంలో 1935లో జన్మించిన సత్యనారాయణ గుడివాడ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశారు. నటనపై ఆసక్తితో కాలేజీ రోజుల్లోనే ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ప్రముఖ నిర్మాత డీఎల్ నారాయణ ఆయనలోని ప్రతిభను గుర్తించి తొలిసారి ‘సిపాయి కూతురు’ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత పౌరాణిక, జానపద, కమర్షియల్ సినిమాల్లో హీరోగా, విలన్‌గా నటించి అగ్రనటుల్లో ఒకరిగా ఎదిగారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబుతోపాటు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి నటులతోనూ సత్యనారాయణ నటించారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో సత్యనారాయణ అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.