కుల్దీప్ యాదవ్ ను జట్టు నుంచి తీసేశారంటే నమ్మలేకపోతున్నా: గవాస్కర్
- బంగ్లాదేశ్ తో తొలి టెస్టులో రాణించిన కుల్దీప్
- 8 వికెట్లు, 40 పరుగులతో అదరగొట్టిన కుల్దీప్
- రెండో టెస్టుకు పక్కనబెట్టిన టీమిండియా మేనేజ్ మెంట్
- ఇదేం నిర్ణయం అంటూ విస్మయానికి లోనైన గవాస్కర్
బంగ్లాదేశ్ తో తొలి టెస్టులో 8 వికెట్లు పడగొట్టి, ఒక ఇన్నింగ్స్ లో 40 పరుగులు కూడా చేసిన టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను అనూహ్యరీతిలో రెండో టెస్టుకు ఎంపిక చేయలేదు. కుల్దీప్ స్థానంలో ఎడమచేతివాటం పేసర్ జయదేవ్ ఉనద్కట్ ను ఎంపిక చేశారు. దీనిపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు.
ఢాకాలో బంగ్లాదేశ్ తో టెస్టుకు కుల్దీప్ యాదవ్ ను జట్టు నుంచి తప్పించడాన్ని నమ్మలేకపోతున్నానని అన్నారు. గత టెస్టులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన ఆ ఆటగాడ్ని తర్వాతి టెస్టుకు ఎంపిక చేయకపోవడాన్ని ఏమనాలో అర్థం కావడంలేదని పేర్కొన్నారు.
'నమ్మశక్యం కావడం లేదు' అనడం తప్ప అంతకంటే మృదువైన పదాలేమీ మాట్లాడలేకపోతున్నానని గవాస్కర్ వివరించారు. కఠినమైన మాటలతో విమర్శించాలని ఉందని అన్నారు. ఓ మ్యాచ్ లో 20 వికెట్లలో 8 వికెట్లను తానొక్కడే తీసిన ఆటగాడికి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించగలమా? అని గవాస్కర్ విస్మయం వ్యక్తం చేశారు.
రెండో టెస్టులో అశ్విన్, అక్షర్ పటేల్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లను తీసుకున్నారని, వారిలో ఒకరిని పక్కనబెడితే బాగుండేదని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఢాకా పిచ్ బౌలింగ్ కు సహకరిస్తున్న నేపథ్యంలో కుల్దీప్ ను ఆడించి ఉంటే గౌరవప్రదంగా ఉండేదని తెలిపారు.