తెలంగాణ గడ్డపై మీకు ఏం పని?.. ఏపీలో మేం పోటీ చేస్తాం: మంత్రి గంగుల
- షర్మిల కొత్త ముసుగులో తెలంగాణకు వచ్చారన్న గంగుల
- ఇప్పుడు అసలైన వ్యక్తి చంద్రబాబు ఎంటరయ్యారని వ్యాఖ్య
- ఏపీ సంపదను దోచుకోవాలని తాము ఎన్నడూ అనుకోలేదన్న గంగుల
తెలంగాణ సంపదపై కన్నేసిన కొందరు ఇక్కడకు వస్తున్నారని, వారిపై తిరుగుబాటు మొదలు పెట్టకపోతే మన పిల్లల భవిష్యత్తు అంధకారమవుతుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె కొత్త ముసుగులో ఇక్కడకొచ్చారని విమర్శించారు. కేఏ పాల్, పవన్ కల్యాణ్ కూడా వచ్చారని... ఇప్పుడు అసలైన వ్యక్తి చంద్రబాబు కూడా వచ్చారని విమర్శించారు. వీరంతా రకరకాల వేషాల్లో వచ్చిన ఒకే తాను ముక్కలని దుయ్యబట్టారు. ఏపీ మూలాలున్న వీరికి తెలంగాణలో ఏం పని అని ప్రశ్నించారు. వీరందరి వెనుక బీజేపీ ఉందని ఆరోపించారు. విడిపోయిన రెండు రాష్ట్రాలను కలపడమే వీరి లక్ష్యమని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ద్వారా తాము దేశమంతా వెళ్తుంటే... వీరు మాత్రం తెలంగాణకు వస్తున్నారని కమలాకర్ విమర్శించారు. తెలంగాణ నీళ్లను, హైదరాబాద్ సంపదను ఎత్తుకుపోవడానికే వీరు వస్తున్నారని అన్నారు. ఏపీ సంపదను దోచుకోవాలని తాము ఎన్నడూ అనుకోలేదని... అందుకే అక్కడ బీఆర్ఎస్ పక్కాగా పోటీ చేస్తుందని చెప్పారు.