ఏపీ ఉద్యోగులు ఒకటో తేదీని మర్చిపోయే పరిస్థితి వచ్చింది: బొప్పరాజు
- జీతాల చెల్లింపుపై ఉద్యోగుల అసంతృప్తి
- ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లు ఇవ్వాలన్న బొప్పరాజు
- సంక్రాంతి లోపు బకాయిలు చెల్లించాలని డిమాండ్
- లేకపోతే ఉద్యమం తప్పదని వెల్లడి
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు ఒకటో తేదీని మర్చిపోయే పరిస్థితి వచ్చిందని ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఒకటో తేదీన జీతాలు, పెన్షన్లు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. బకాయిలపై ప్రభుత్వానికి సంక్రాంతి వరకు గడువు ఇచ్చామని వెల్లడించారు.
ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కొత్త కలెక్టరేట్ లలో పూర్తిస్థాయి సిబ్బందిని నియమించాలని బొప్పరాజు డిమాండ్ చేశారు.
ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కొత్త కలెక్టరేట్ లలో పూర్తిస్థాయి సిబ్బందిని నియమించాలని బొప్పరాజు డిమాండ్ చేశారు.