బీసీసీఐకి షాకిచ్చిన స్పాన్సర్లు బైజూస్, ఎంపీఎల్

  • ఒప్పందాన్ని మధ్యలోనే రద్దు చేసుకుంటామని ప్రకటించిన సంస్థలు
  • భారత క్రికెట్ జట్టు టైటిల్ స్పాన్సర్ గా ఉన్న బైజూస్ 
  • కిట్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న ఎంపీఎల్ స్పోర్ట్స్
భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన స్పాన్సర్లు బైజూస్, ఎంపీఎల్‌ స్పోర్ట్స్ బీసీసీఐకి షాకిచ్చాయి. స్పాన్సర్ షిప్ కాంట్రాక్ట్ నుంచి మధ్యలోనే వైదొలగాలని నిర్ణయించుకున్నాయి. ఈ విషయాన్ని రెండు సంస్థలు బోర్డుకు తెలియజేశాయి. బీసీసీఐ టైటిల్ స్పాన్సర్ షిప్ కాంట్రాక్ట్ నుంచి వైదొలుగుతున్నట్టు బైజూస్ బోర్డుకు మెయిల్ చేసింది. వచ్చే ఏడాది 2023 నవంబర్ 31 వరకు బైజూస్ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించాల్సి ఉంది. గత స్పాన్సర్ ఒప్పో స్థానంలో రూ. 290 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు భారత జట్టు కిట్, మర్కండైస్ స్పాన్సర్ గా నైకీ స్థానంలో ఎంపీఎల్ వ్యవహరిస్తోంది. 2020 నవంబర్ లో ఈ ఒప్పందం కుదుర్చుకుంది. 

2023 డిసెంబర్ 31వ తేదీ వరకు కొనసాగాల్సిన ఎంపీఎల్ కూడా ఒప్పందాన్ని మధ్యలోనే వదులుకోవాలని భావిస్తోంది. తమ హక్కులను మరో సంస్థ (కెవాల్‌ కిరణ్‌ క్లాతింగ్‌ లిమిట్‌)కు ట్రాన్స్‌ఫర్‌ చేయాలని బీసీసీఐను ఎంపీఎల్‌ కోరింది. ఈ విషయంపై బుధవారం జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బోర్డు పెద్దలు చర్చలు జరిపారు. మార్చి 31 వరకు స్పాన్సర్లుగా కొనసాగాలని రెండు సంస్థలను కోరినట్టు తెలిపారు. ఇక, కొత్త సెలక్షన్‌ కమిటీని ఏర్పాటు చేసిన తర్వాతే టీమిండియా ప్లేయర్ల సెంట్రల్‌ కాంట్రాక్టులను ప్రకటించాలని నిర్ణయించారు.


More Telugu News