తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తామన్న చంద్రబాబు వ్యాఖ్యలపై కవిత రియాక్షన్
- తెలంగాణలో టీడీపీ రాజకీయాలు చెల్లవన్న కవిత
- టీడీపీని రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని వ్యాఖ్య
- మళ్లీ రాజకీయాలు చేద్దామంటే కుదరదని ఎద్దేవా
తెలంగాణలో టీడీపీ బలంగా ఉండాల్సిన అవసరం ఉందని, రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిన్న ఖమ్మం సభలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. టీడీపీ ఎక్కడుంది అనే వాళ్లకు ఈ సభకు ప్రజల నుంచి వచ్చిన స్పందనే సమాధానమని అన్నారు. తెలంగాణలో ఓటు అడిగే హక్కు టీడీపీకి ఉందని, తాను ఫౌండేషన్ వేయకపోతే హైదరాబాద్ ఇంత అభివృద్ది చెందేదా? అని ప్రశ్నించారు. వివిధ పార్టీల్లోకి వెళ్లిన వారంతా మళ్లీ టీడీపీలోకి రావాలని పిలుపునిచ్చారు.
చంద్రబాబు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తెలంగాణలో టీడీపీ రాజకీయాలు చెల్లవని ఆమె అన్నారు. ఇక్కడ టీడీపీని చంద్రబాబు మళ్లీ తీసుకురావాలనుకుంటున్నారని... ఆ పార్టీని తెలంగాణ ప్రజలు తిరస్కరించారని చెప్పారు. ఇప్పుడు వచ్చి మళ్లీ రాజకీయం చేద్దామంటే కుదరదని అన్నారు. చుక్కలు ఎన్నున్నా చంద్రుడు ఒక్కడే అన్నట్టుగా తెలంగాణలో కేసీఆర్ ఒక్కరేనని చెప్పారు.