మా ప్రభుత్వం వస్తే వదిలే ప్రసక్తే లేదు: పోలీసులకు యరపతినేని వార్నింగ్

  • మాచర్లలో సైతం భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారన్న యరపతినేని
  • పోలీసులను డీజీపీ అదుపులో పెట్టుకోవాలని విన్నపం
  • టీడీపీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా
మాచర్ల నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు. ఇటీవల మాచర్లలో జరిగిన అల్లర్లకు సంబంధం లేని వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని భయపెడుతున్నారని మండిపడ్డారు. మాచర్లలో సైతం భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. 

పోలీసులను డీజీపీ అదుపులో పెట్టుకోవాలని యరపతినేని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెడుతున్న పోలీసులను వదిలిపోట్టబోమని హెచ్చరించారు. వైసీపీ ఆరిపోయే దీపమని, రానున్న రోజుల్లో వైసీపీ నేతలు మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. వైసీపీ నేతలు, పోలీసులు వేధింపులకు గురి చేసినా... టీడీపీ కార్యకర్తలు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని చెప్పారు. టీడీపీ నేతలు, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని అన్నారు.


More Telugu News