నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • ప్రపంచదేశాల్లో మళ్లీ కరోనా కలకలం
  • ఒడిదుడుకులకు గురైన సూచీలు
  • ఆరంభంలో లాభాలు
  • అనంతరం పతనం దిశగా షేర్లు
భారత స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 635 పాయింట్ల నష్టంతో 61,067 వద్ద ముగిసింది. నిఫ్టీ 185 పాయింట్ల నష్టంతో 18,199 వద్ద స్థిరపడింది. చైనా, దక్షిణ కొరియా, అమెరికా తదితర దేశాల్లో కరోనా వైరస్ ఉన్నట్టుండి విజృంభించడంతో స్టాక్ మార్కెట్ ఒడిదుడులకు లోనైంది. 

ఈ క్రమంలో ఇవాళ ఉదయం ట్రేడింగ్ ఆరంభంలో లాభాల బాటలో పయనించిన సూచీలు ఆ తర్వాత పతనం దిశగా సాగాయి. 

ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సెర్వ్, మారుతిసుజుకి ఇండియా, అల్ర్టాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు నష్టాలు చవిచూశాయి. 

సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, హెచ్ సీఎల్ టెక్నాలజీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్ లాభాలు కళ్లజూశాయి.


More Telugu News