గెలిస్తేనే తప్ప ఎన్ని లక్షలు ఇస్తానన్నా తీసుకునేవాడిని కాదు: ఆదిరెడ్డి
- ముగిసిన బిగ్ బాస్ సీజన్ 6
- 4 పొజిషన్లో బయటికి వచ్చిన ఆదిరెడ్డి
- గెలవడం కోసం తన ప్రయత్నం తాను చేశానని వెల్లడి
- గెలవకుండా డబ్బుతీసుకోవడం తనకి నచ్చదని వ్యాఖ్య
బిగ్ బాస్ హౌస్ లోకి కామన్ మేన్ గా వచ్చిన ఆదిరెడ్డి, టాప్ 4 పొజిషన్లో హౌస్ లో నుంచి బయటికి వెళ్లిపోవలసి వచ్చింది. 'బీబీ కేఫ్' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిరెడ్డి మాట్లాడుతూ .. "బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటరైన తరువాత రెండు మూడు వారాల పాటు నేను సరిగ్గా ఆడలేకపోయాను. అందుకు కారణం నేను వచ్చిన నేపథ్యం కావొచ్చు. ఆ తరువాత మాత్రం భయపడుతూ .. ఆచి తూచి ఆడుతూ వెళ్లాను" అన్నాడు.
" టాప్ 3 వరకూ ఉంటానని అనుకున్నాను .. కానీ అలాంటి అవకాశం రాలేదు. ఒకవేళ నేను టాప్ 3లో ఉంటే .. 25 లక్షలు ఆఫర్ చేసినా .. 50 లక్షలు ఇచ్చినా తీసుకునేవాడిని కాదు. విన్నింగ్ ప్రైజ్ మనీ విన్నర్ అయిన వ్యక్తికి రావాలి. 50 లక్షలు విన్నర్ కి రావాలనేది జనం ఉద్దేశం. అందులో నుంచి కొంత నేను తీసుకుని వెళ్లిపోవడం కరెక్టు కాదు. నాకంటే బాగా ఆడినవారికి ఆ మనీ చెందడమే కరెక్ట్ అనుకునే రకం నేను" అన్నాడు.
" గతంలో బిగ్ బాస్ ను బయట నుంచి చూస్తున్నప్పుడు, ఇలాంటి ఒక సందర్భం ఎదురైతే ఆ డబ్బుతీసుకుని ఆ ఇంటి సభ్యుడు వెళ్లిపోవచ్చు గదా అనుకునేవాడిని. కానీ హౌస్ లోకి వెళ్లిన తరువాత .. అక్కడి వాతావరణం .. పోటీదారుల కష్టం చూసిన తరువాత నా అభిప్రాయం మారింది. అందువలన ఎంత డబ్బు ఆఫర్ చేసినా, గెలవలేకుండా తీసుకోవడం నాకు ఎంతమాత్రం నచ్చని పని" అంటూ చెప్పుకొచ్చాడు.