ఈ ఆహారంతో కొలెస్ట్రాల్ సమస్యే ఉండదు!

  • మోనో అన్ శాచురేటెడ్ ఉండే నూనెలను వాడుకోవాలి
  • పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యాన్ని పెంచాలి
  • ముడి ధాన్యాలు, ఫైబర్ ఉన్న వాటిని తీసుకోవాలి
తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంటుంది. మారిన జీవనశైలి నేపథ్యంలో ఆహారంలోనూ మార్పులు అవసరమవుతున్నాయి. మన పెద్దల నాటి కాలంలో జీవనశైలి వేరు. కనుక వారు పాటించిన ఆహార నియమాలు నేడు మనకు సరిపోవాలనేమీ లేదు. ముఖ్యంగా నేటి జీవన శైలి కారణంగా అధిక చెడు కొలెస్ట్రాల్, స్థూలకాయం, రక్తపోటు, మధుమేహం సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్నాయి. కొలెస్ట్రాల్, రక్తపోటు, గుండె జబ్బులు వీటి మధ్య సంబంధం ఉంది. చెడు కొవ్వులు పెరిగిపోతే రక్తపోటు పెరగడమే కాకుండా, రక్త నాళాల్లో పూడికలతో గుండెపోటు సమస్యలు ఎదురవుతాయి. అందుకని ఆహారంలో కొన్ని మార్పులతో చెడు కొలెస్ట్రాల్ సమస్యను అధిగమించొచ్చు.  

  • మోనో శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్న వంట నూనెలను వాడుకోవాలి. నువ్వుల నూనె, ఆవనూనె, ఆలివ్ ఆయిల్ ఈ రకానికి చెందినవే. 
  • రోజువారీగా తీసుకునే పండ్లు, కూరగాయల పరిమాణాన్ని పెంచండి. అందులోనూ యాపిల్, ద్రాక్ష, స్ట్రాబెర్రీ, సిట్రస్ పండ్లు తీసుకోవాలి. వీటిల్లో ఎల్ డీఎల్ ను తగ్గించే పెక్టిన్ ఉంటుంది.
  • కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే వాటిని తక్కువ తీసుకోండి.
  • తీసుకునే పదార్థాల్లో సొల్యూబుల్ ఫైబర్ ఉండాలి. ముడి ధాన్యాలు, ఓట్స్ లో ఫైబర్ లభిస్తుంది. 
  • వైద్యుల సూచనతో విటమిన్ ఈ సప్లిమెంట్ ను సైతం తీసుకోవచ్చు. ఎల్ డీఎల్ కొలెస్ట్రాల్ ఆక్సిడేషన్ ను ఇది అడ్డుకుంటుంది. 
  • స్టెరాల్స్, స్టానాల్స్ ఉన్న వాటిని తీసుకోవాలి. చెట్ల బంక నుంచి వీటిని ఉత్పత్తి చేస్తారు. వీటితో ఎల్ డీఎల్ తగ్గుతుంది. చాక్లెట్ల తయారీలోనూ వీటిని వినియోగిస్తున్నారు.
  • సోయా ఉత్పత్తులు కూడా కొలెస్ట్రాల్ సమస్యకు అనువైనవి.
  • చేపలను వారానికి రెండు, మూడు సార్లు తినడం వల్ల కూడా కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వీటిల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఈ పని చేస్తాయి. 
  • నట్స్ ను తినడం కూడా మంచిదే. వాల్ నట్, పీనట్ (వేరుశనగ), బాదం తీసుకోవచ్చు.


More Telugu News