ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లోకి ప్రధాని జన్మస్థలం వాద్ నగర్

  • యునెస్కో గుర్తింపు లభించిందన్న ఆర్కియోలాజికల్ సర్వే
  • ఈ పట్టణానికి ఘన చరిత్ర ఉందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • మొతెరా సూర్య దేవాలయం, త్రిపుర ఉనకోటికి సైతం చోటు
ప్రధాని నరేంద్ర మోదీ జన్మ స్థలం గుజరాత్ లోని వాద్ నగర్ ఇప్పుడు.. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలోకి చేరిపోయింది. ఈ విషయాన్ని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ప్రకటించింది. వాద్ నగర్ తోపాటు, మొతెరాలోని సూర్య దేవాలయం, త్రిపురలోని ఉనకోటి (రాతి శిల్పాలు) సైతం ప్రపంచ వారసత్వ ప్రదేశాల గుర్తింపు పొందినట్టు తెలిపింది. 

యునెస్కో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చే నామినేషన్లను (ప్రతిపాదనలు) అన్ని రకాలుగా పరిశీలించిన మీదట తగిన అర్హతలు ఉన్న వాటికి జాబితాలో చోటు కల్పిస్తుంటుంది. సాంస్కృతికంగా, చారిత్రకంగా తగిన అర్హతలు ఉంటేనే పరిగణనలోకి తీసుకుంటుంది. భారత్ లోని మరిన్ని స్మారక చిహ్నాలు, ప్రదేశాలను ప్రపంచ వారసత్వ సంపద జాబితా కోసం గుర్తించడంలో ఏఎస్ఐ కృషిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అభినందించారు. తాజాగా చేర్చిన వాటితో కలిపి ప్రపంచ వారసత్వ కట్డడాలు, ప్రదేశాల జాబితాలో భారత్ నుంచి చేరిన వాటి సంఖ్య 52కు పెరిగింది. 

వాద్ నగర్ పట్టణానికి ఘన చరిత్ర ఉందని, క్రీస్తు పూర్వం 8వ శతాబ్దం చివరి వరకు అది విస్తరించి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పట్టణంలో ఇప్పటికీ పెద్ద సంఖ్యలో చారిత్రక భవనాలు ఉన్నట్టు చెప్పారు. 

మొతెరా సన్ టెంపుల్
 త్రిపుర ఉనకోటి


More Telugu News