జలపాతాల వద్ద ఆటలతో ఎంత రిస్క్ ఉంటుందో ఈ వీడియో చెబుతుంది!
- ఫిలిప్పీన్స్ లోని క్యాట్ మాన్ పట్టణ సమీపంలో పెద్ద జలపాతం
- పర్యాటకులు సందర్శించిన సమయంలో భారీ వరద
- కొట్టుకుపోయిన కొందరు.. చెట్ల సాయంతో బయటపడిన కొందరు
వినోదానికి పరిమితి ఉండాలి. వినోదం కోసం ప్రాణాలను పణంగా పెట్టే రిస్క్ చేయకూడదు. అటవీ, పర్వత ప్రాంతాల్లో జలపాతాలు నిత్యం వేలాది మంది సందర్శకులను ఆకర్షిస్తుంటాయి. జలపాతాల్లోకి దిగి స్నానాలు చేయడాన్ని ఎంతో మంది ఇష్టపడతారు. కానీ, అనుకోని విధంగా ప్రమాదం ఎదురయ్యే అవకాశాల్లేకపోలేదు. ఎగువ భాగంలో భారీ వర్షం పడితే ఒక్కసారిగా వరద నీరు ఎగసి పడినప్పుడు.. జలపాతం మార్గంలో ఉన్న వారికి రిస్క్ ఎదురవుతుంది.
ఫిలిప్పీన్స్ లోని ఓ జలపాతం వద్ద సరిగ్గా ఇలాగే జరిగింది. సెబూకి ఉత్తరాన ఉన్న క్యాట్ మాన్ పట్టణం సమీపంలో టినుబ్దాన్ జలపాతం ఉంది. ఇక్కడే 2021లో పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో మరోసారి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతోంది. ఇప్పటికే 10 లక్షల మందికి పైగా ఈ వీడియోను చూశారు. జలపాతాలను సందర్శించే ప్రతి ఒక్కరూ ఈ వీడియోను తప్పకుండా ఒకసారి చూడాలి.
సుమారు పది మంది వరకు జలపాతం మార్గంలో కూర్చున్న సమయంలో పై నుంచి వరద నీరు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో వారు కొట్టుకుపోవడాన్ని గమనించొచ్చు. కొందరు చెట్లను ఆధారంగా చేసుకుని ప్రాణాలను కాపాడుకున్నారు. ‘మీ సోషల్ మీడియా లైక్ ల సంఖ్య కంటే మీ ప్రాణాలు మరింత ముఖ్యమైనవి’ అంటూ ఈ వీడియోను షేర్ చేసిన తన్సు యెజెన్ అనే వ్యక్తి క్యాప్షన్ పెట్టారు. వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇనిస్టిట్యూట్ కు చెందిన విద్యార్థుల బృందం పదేళ్ల క్రితం ఉత్తరాఖండ్ లో లార్జీ హైడ్రో పవర్ ప్రాజెక్టు నుంచి ఒక్కసారిగా వదిలిన నీటి ప్రవాహానికి కొట్టుకుపోవడం గుర్తుండే ఉంటుంది.