మన నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడనేది నేర్చుకోదగ్గ పాఠం: సీఎం జగన్

  • క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
  • అధికారంలో ఉన్నవారు ఒదిగి ఉండాలని వెల్లడి
  • దేవుడు ఆశించేది ఇదేనని వివరణ
ఏపీ సీఎం జగన్ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. మన నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడనేది నేర్చుకోదగ్గ పాఠం అని వెల్లడించారు. అధికారంలో ఉన్నవారు ఒదిగి ఉండాలని దేవుడు ఆశిస్తాడు అని తెలిపారు. తాము ప్రజలకు సేవకులం మాత్రమేనని అధికారంలో ఉన్నవారు గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. ప్రజలకు మరింత సేవ చేసే అవకాశాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నా, ఇంకా ఒదిగి ఉండే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా అని సీఎం జగన్ వివరించారు. 

విజయవాడలో ప్రభుత్వం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. బందరు రోడ్డులోని ఏప్లస్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు.

కాగా, సీఎం జగన్ రేపు (డిసెంబరు 21) పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా, బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. వేమూరు నియోజకవర్గం యడ్లపల్లిలో జడ్పీ హైస్కూల్ లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ చేయనున్నారు.


More Telugu News