సీఎం కేసీఆర్ ను కలిసిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్
- తెలంగాణ పర్యటనకు వచ్చిన పంజాబ్ సీఎం
- ప్రగతి భవన్ లో కేసీఆర్ తో సమావేశం
- బీఆర్ఎస్ పై చర్చ!
- ఈ నెల 24న హైదరాబాద్ కు పంజాబ్ స్పీకర్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేడు హైదరాబాద్ పర్యటనకు విచ్చేశారు. ప్రగతిభవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్... పంజాబ్ సీఎంను సాదరంగా ఆహ్వానించారు. శాలువా కప్పి వీణ బొమ్మను బహూకరించారు. అటు, భగవంత్ మాన్ కూడా కేసీఆర్ కు శాలువా కప్పి ఓ కానుక అందజేశారు.
ఇక, ఈ ఇద్దరు సీఎంలు తమ భేటీలో ప్రధానంగా జాతీయ రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం కావడం, పార్టీ కార్యాచరణ వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అటు, పంజాబ్ లో పరిస్థితులను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు.
కాగా, ఈ నెల 24న పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ సర్దార్ కుల్తార్ సింగ్ సంధ్వాన్, డిప్యూటీ స్పీకర్ జైకిషన్ సింగ్ రౌరీ తదితరులు కూడా హైదరాబాద్ రానున్నారు. వారు కూడా సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.