ఏపీలో మహిళలపై దాడులు పెరిగాయి: కేంద్రం

  • లోక్ సభలో కేంద్రం వెల్లడి
  • 2018తో పోల్చితే దేశంలో అత్యాచారాలు పెరిగాయన్న కేంద్రం
  • మహిళల ఆత్మగౌరవానికి భంగం కేసుల్లో ఏపీ టాప్
ఏపీలో మహిళలపై దాడుల అంశంలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రం లోక్ సభలో నేడు జవాబిచ్చింది. ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయని వెల్లడించింది. మహిళల ఆత్మగౌరవానికి భంగం కేసుల్లో ఏపీదే అగ్రస్థానమని తెలిపింది. మహిళలపై జరుగుతున్న దాడుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్ కంటే ఏపీలోనే అత్యధిక కేసులు చోటుచేసుకుంటున్నాయని కేంద్రం వివరించింది. 

2018తో పోల్చితే దేశంలో అత్యాచారాలు, దాడులు పెరిగాయని వెల్లడించింది. ఏపీలో అత్యాచారాలు 22 శాతం, దాడులు 15 శాతం పెరిగాయని తెలిపింది. ఈ మేరకు లిఖితపూర్వకంగా వెల్లడించింది.


More Telugu News