నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 103 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 35 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 1.75 శాతం పడిపోయిన టాటా మోటార్స్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 103 పాయింట్లు నష్టపోయి 61,702కి పడిపోయింది. నిఫ్టీ 35 పాయింట్లు కోల్పోయి 18,385 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాల్లోనే కొనసాగిన మార్కెట్లు చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి.  

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టీసీఎస్ (1.29%), రిలయన్స్ (0.81%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.50%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.43%), యాక్సిస్ బ్యాంక్ (0.41%). 

టాప్ లూజర్స్:
టాటా మోటార్స్ (-1.75%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.60%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.29%), భారతి ఎయిర్ టెల్ (-1.23%), ఎన్టీపీసీ (-1.02%).


More Telugu News