రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్లుగా విజయసాయిరెడ్డి, పీటీ ఉష
- 10 రోజుల క్రితమే ప్యానల్ వైస్ ఛైర్మన్ గా విజయసాయి నియామకం
- కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆయన పేరు తొలగింపు
- ఇప్పడు మళ్లీ ఆయనను నియమిస్తూ రాజ్యసభ ఛైర్మన్ ప్రకటన
రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్ గా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ఎన్నికయ్యారు. వాస్తవానికి 10 రోజుల క్రితమే విజయసాయిని ప్యానెల్ వైస్ ఛైర్మన్ గా నియమించారు. అయితే, ఆ తర్వాత చోటుచేసుకున్న కొన్ని పరిణామాలతో ఆయన పేరును తొలగించారు. ఇప్పుడు మళ్లీ ఆయనను ప్యానెల్ వైస్ ఛైర్మన్ గా నియమించారు. ఈ మేరకు భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రకటించారు. పరుగుల రాణి పీటీ ఉషను కూడా ప్యానెల్ వైస్ ఛైర్మన్ గా నియమించారు. ఈ సందర్భంగా ఇద్దరికీ జగదీప్ ధన్కర్ అభినందనలు తెలిపారు. ప్యానెల్ వైస్ ఛైర్మన్ గా ఒక నామినేటెడ్ ఎంపీ (పీటీ ఉష) నియామకం కావడం గమనార్హం.