నేడు కేసీఆర్ తో భేటీ కానున్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్
- ప్రగతిభవన్ లో సమావేశం కానున్న ముఖ్యమంత్రులు
- దేశ రాజకీయాలపై చర్చించే అవకాశం
- ఈ నెల 24న రానున్న పంజాబ్ అసెంబ్లీ స్పీకర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను నేడు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కలవనున్నారు. ప్రగతిభవన్ లో వీరి సమావేశం కొనసాగనుంది. దేశ రాజకీయాలతో పాటు పాలు అంశాలపై వీరు చర్చించనున్నారు. ఈ భేటీ అనంతరం పారిశ్రామికవేత్తలతో భగవంత్ మాన్ సమావేశం కానున్నారు.
ఫిబ్రవరిలో పంజాబ్ లోని మొహాలీలో ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్ లో పాల్గొనాల్సిందిగా పారిశ్రామికవేత్తలను పంజాబ్ సీఎం ఆహ్వానించనున్నారు. మరోవైపు ఈనెల 24న పంజాబ్ శాసనసభ స్పీకర్ సర్దార్ కుల్తార్ సింగ్ సంధ్వాన్, డిప్యూటీ స్పీకర్ జైకిషన్ సింగ్ రౌరీ, రాజ్యసభ సభ్యుడు విక్రమ్ జిత్ సింగ్ సాహ్ని, ఎమ్మెల్యే కుల్వంత్ సింగ్ పండోరి హైదరాబాద్ కు రానున్నారు.