రేషన్ కార్డు పోగొట్టుకున్నారా..? అయితే, ఇలా పొందొచ్చు!

  • ఇంట్లోనే కూర్చుని ఈ-రేషన్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు 
  • ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు
  • రేషన్ కార్డుతో ఆధార్, మొబైల్ నంబర్ లింక్ చేస్తేనే ఈ అవకాశం
కుటుంబ గుర్తింపునకు, తక్కువ ధరలకు రేషన్ పొందే కీలక పత్రమే రేషన్ కార్డు.. ఇలాంటి కీలకమైన కార్డును పోగొట్టుకుంటే?.. ఇంట్లోనే ఎక్కడో పెట్టి మరిచిపోతే? పనులు మానేసుకుని రోజుల తరబడి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిందేనా.. అంటే అక్కర్లేదని అధికారులు చెబుతున్నారు. ఇంట్లోనే కూర్చుని ఈ-రేషన్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చని అంటున్నారు. అయితే, రేషన్ కార్డుకు ఆధార్ కార్డును, మొబైల్ నెంబర్ ను లింక్ చేసి ఉంటేనే ఇది సాధ్యమని చెప్పారు.

ఈ-రేషన్ కార్డును ఇలా డౌన్ లోడ్ చేసుకోవాలి..
  • ముందుగా nfsa.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి
  • హోమ్ పేజీలో రేషన్ కార్డ్ ను ఎంపిక చేసుకోవాలి
  • ఇందులో స్టేట్ పోర్టల్ లోని రేషన్ కార్డ్ వివరాలపై క్లిక్ చేయాలి
  • రేషన్ కార్డు నంబర్, కుటుంబ పెద్ద పేరు, ఆధార్ కార్డు నంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ వివరాలు ఇవ్వాలి
  • ఈ వివరాలన్నీ ఇచ్చాక మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి
  • దీంతో పీడీఎఫ్ ఫార్మాట్ లో ఈ-రేషన్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు



More Telugu News