సుకుమార్ లేకపోతే నా జర్నీ ఇలా ఉండేది కాదేమో: బన్నీ
- '18 పేజెస్'కి చీఫ్ గెస్టుగా వచ్చిన బన్నీ
- బన్నీవాసుతో అనుబంధం గురించి ప్రస్తావన
- హిట్ ఖాయమంటూ భరోసా
- 'పుష్ప 2' అప్ డేట్ గురించి సుకుమార్ ను బెదిరిస్తున్నానని వ్యాఖ్య
గీతా ఆర్ట్స్ 2 - సుకుమార్ రైటింగ్స్ కలిసి '18 పేజెస్' సినిమాను నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకి ముఖ్య అతిథిగా బన్నీ వచ్చాడు. ఈ ఫంక్షన్ లో ఆయన మాట్లాడుతూ .. "నా ఫేవరేట్ పీపుల్ చేసిన సినిమా కావడం వలన, ఈ సినిమా నాకు చాలా ముఖ్యమైందని చెప్పాలి. సుకుమార్ గారు లేకపోతే నా జర్నీ ఇలా ఉండేది కాదేమో. అందువలన ఆయనంటే గౌరవం .. ప్రేమ .. అభిమానం ఉంటాయి" అని అన్నాడు.
"బన్నీ వాసుతో నాకున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ ఇదే ప్రాజెక్టుపై నాలుగేళ్లుగా ఉన్నాడు. ఆయన కష్టం ఫలించాలని కోరుకుంటున్నాను. ఇక గోపీసుందర్ చాలా గొప్ప మ్యూజిక్ ను అందించాడు. నిఖిల్ - అనుపమ ఇద్దరూ కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ కొట్టాలని ఆశిస్తున్నాను" అన్నాడు.
"అందరూ కూడా 'పుష్ప 2' అప్ డేట్ గురించి అడుగుతున్నారు. 'పుష్ప 2' అప్ డేట్ గురించి చెప్పకపోతే డైలాగ్స్ లీక్ చేస్తానని నేను కూడా సుకుమార్ ను బెదిరిస్తూనే ఉన్నాను. 'పుష్ప 2' అస్సలు తగ్గేదేలే. ఇది నేను అహంభావంతో చెప్పే మాటకాదు. ఎంతో ఇష్టంతో .. నమ్మకంతో చెబుతున్నాను" అన్నాడు.