అల్లు అర్జున్ .. సుకుమార్ లేకపోతే నేను లేను: బన్నీవాసు
- నిఖిల్ హీరోగా రూపొందిన '18 పేజెస్'
- తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్
- తప్పకుండా హిట్ కొడతామన్న బన్నీ వాసు
- ఈ నెల 23న థియేటర్లకు వస్తున్న సినిమా
నిఖిల్ - అనుపమ కాంబినేషన్లో '18 పేజెస్' సినిమా రూపొందింది. సుకుమార్ అందించిన కథకి, పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించాడు. ఈ నెల 23వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుని హైదరాబాదులో నిర్వహించారు. ఈ సినిమా నిర్మాత బన్నీవాసు ఈ వేదికపై మాట్లాడాడు.
"ఇది నాకు 11వ సినిమా. ఇంతవరకూ నేను తీసిన 10 సినిమాలు ఒక ఎత్తయితే, ఈ సినిమా ఒక ఎత్తు. 10 సినిమాల వరకూ నేను ఎంత నేర్చుకున్నానో .. ఈ ఒక్క సినిమాతో అంత నేర్చుకున్నాను. ఆర్టిస్టులు .. టెక్నీషియన్స్ అందరూ కూడా ఈ సినిమా కోసం ఎంతో అంకితభావంతో పనిచేశారు. అదంతా కూడా మీకు కనిపిస్తుంది" అన్నాడు.
"ఇక సుకుమార్ విషయానికొస్తే తను లైఫ్ లోకి ఎప్పుడు వచ్చినా నాకు డబ్బులు బాగా వస్తుంటాయి. నా లైఫ్ లో బన్నీ .. సుకుమార్ లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడినే కాదు. కథాకథనాలు ఎలా ఉన్నప్పటికీ గోపీసుందర్ ఒక మేజిక్ చేస్తాడని నాకు తెలుసు. ఈ సినిమాకి ఆయన మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సూర్యప్రతాప్ తప్పకుండా హిట్ ఇస్తాడని ఆశిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.