ఇంకా కోలుకోని రోహిత్... రెండో టెస్టుకు కష్టమే!
- బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ సందర్భంగా రోహిత్ శర్మకు గాయం
- క్యాచ్ పట్టే యత్నంలో బొటనవేలికి గాయం
- చికిత్స కోసం ముంబయి పయనం
- ఈ నెల 22 నుంచి టీమిండియా-బంగ్లాదేశ్ తో రెండో టెస్టు
ఇటీవల బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ సందర్భంగా టీమిండియా సారథి రోహిత్ శర్మ గాయపడిన సంగతి తెలిసిందే. క్యాచ్ పట్టే యత్నంలో రోహిత్ శర్మ బొటనవేలికి గాయమైంది. దాంతో బంగ్లాదేశ్ తో తొలి టెస్టుకు దూరమయ్యాడు. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో బరిలో దిగిన టీమిండియా బంగ్లాదేశ్ జట్టుపై తొలి టెస్టులో గెలిచింది. ఈ నెల 22 నుంచి రెండో టెస్టు జరగనుంది.
అయితే రోహిత్ శర్మ ఇంకా కోలుకోకపోవడంతో రెండో టెస్టు బరిలోకి దిగేది అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో, రెండో టెస్టులోనూ టీమిండియా కేఎల్ రాహుల్ నాయకత్వంలోనే ఆడనున్నట్టు తెలుస్తోంది.
గాయం అనంతరం రోహిత్ శర్మ వైద్య నిపుణుడ్ని కలిసేందుకు ముంబయి వెళ్లాడు. రోహిత్ శర్మ ఇప్పటికీ భారత్ లోనే ఉన్న దృష్ట్యా రెండో టెస్టులో అతడు ఆడే అవకాశాలు దాదాపుగా లేనట్టే. బీసీసీఐ వర్గాలు కూడా ఇదే చెబుతున్నాయి. రోహిత్ నొప్పితో బాధపడుతున్నాడని, అతడు ఢాకా టెస్టు ఆడకపోవచ్చని బోర్డు అధికారి ఒకరు తెలిపారు.