ఢిల్లీ లిక్కర్ స్కాంలో నలుగురు నిందితుల కస్టడీ పొడిగింపు

  • సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం
  • నేటితో ముగిసిన నలుగురు నిందితుల కస్టడీ 
  • కోర్టులో హాజరుపరిచిన ఈడీ
  • 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన కోర్టు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో నలుగురు నిందితులకు న్యాయస్థానం కస్టడీ పొడిగించింది. నేటితో నలుగురికి కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. వాదనల అనంతరం నలుగురికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. 

అనంతరం ఈ కేసు విచారణను జనవరి 2కి వాయిదా వేసింది. ఈడీ నివేదికను పరిగణనలోకి తీసుకుని బినోయ్ బాబు బెయిల్ పిటిషన్ పై విచారణ జనవరి 9కి వాయిదా వేసింది. అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్లపై విచారణ జనవరి 4కి వాయిదా వేసింది. 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, బినోయ్ బాబు నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో తొలుత సెప్టెంబరు 27న విజయ్ నాయర్ ను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు, అక్టోబరు 10న అభిషేక్ బోయినపల్లిని అదుపులోకి తీసుకున్నారు. నవంబరు 10న శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబులను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.


More Telugu News